GNTR: మంగళగిరి కొండపై వెలిసిన గండాలయ్య స్వామిని అమావాస్య సందర్భంగా భక్తులు భారీగా దర్శించుకున్నారు. తమ కష్టాలు తొలగి, ఆయురారోగ్యాలు సిద్ధించాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా క్షేత్ర సంప్రదాయం ప్రకారం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారికి నువ్వుల నూనె సమర్పించి దీపాలు వెలిగించుకున్నారు. భక్తుల రద్దీతో కొండపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
మంగళగిరి కొండపై అమావాస్య పూజలు


