హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైవే సమీపంలో భారీ పైప్‌లైన్ లీకేజీ

NDL: ప్యాపిలి పట్టణంలోని వెంగళంపల్లె చెరువు కట్ట హైవే సమీపంలో పైప్‌లైన్ లీకేజీతో నీరు భారీగా వృథా అవుతోంది. పైపు నుంచి నిరంతరాయంగా నీరు బయటకు ప్రవహిస్తుండటంతో విలువైన తాగునీరు వృథా అవుతోందని స్థానికులు శనివారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టి, పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.