హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాలు లేక వరి పంటలు ఎండిపోతున్నాయి.. రైతుల ఆవేదన

RR: జిల్లా కేశంపేట మండలంలోని పలు గ్రామాల్లో వర్షాలు లేక వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. వర్షాకాలం నుంచి సరైన సమయంలో వానలు కురవకపోవడంతో సాగుచేసిన పంటలు దెబ్బతిన్నాయని,పెట్టుబడులు పెట్టి సాగు చేసిన వరి చేలు ఎండిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి, నష్టపరిహారాన్ని అందించాలన్నారు.