హైదరాబాద్: 28°C
క్రీడలు

నొవాక్ జకోవిచ్‌కు షాక్

సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కు షాక్ తగిలింది. షాంఘై మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో అతడు రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. హర్కాజ్ (పోలెండ్) చేతిలో నొవాక్‌ 4-6, 3-6తో కంగుతిన్నాడు. ఇటీవల చైనా ఓపెన్ గెలిచి ఫామ్‌లోకి వచ్చిన జకోవిచ్.. ఆ జోరును ప్రదర్శించలేకపోయాడు. కెరీర్‌లో హర్కాజ్‌తో తొమ్మిదిసార్లు తలపడిన నొవాక్‌కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం.