హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోదీ అంటే విపక్షాలకు భయం: గొరకపూడి చిన్నయ్యదొర

కాకినాడ: కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ఆరోపణలు చేస్తోందని ఉమ్మడి ఏపీ మున్సిపల్ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ గొరకపూడి చిన్నయ్యదొర అన్నారు. సామర్లకోటలో ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంలను బీజేపీ మేనేజ్ చేసి ఉంటే తెలంగాణ, కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చిందన్నారు.