హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

ప్రకాశం: దసరా సెలవుల్లో విద్యార్థులు వెలుగొండ ప్రాంతాన్ని సందర్శించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం గ్రామీణ ఎస్సై వేమన సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా, తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని కోరారు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.