హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్ష్మీపురంలో 672 అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం

కర్నూలు జిల్లా లక్ష్మీపురం గ్రామంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో రూరల్ పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ శనివారం నిర్వహించారు. ఈ తనిఖీల్లో ముగ్గురు వ్యక్తుల నుంచి 672 అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు. అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.