హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీ వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

CTR: పెరటాసి మాసం నాలుగో శనివారం సందర్భంగా పుంగనూరులోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటికీటలాడింది. శ్రీవారి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు క్యూ కట్టారు. గోవింద నామస్మరణలతో ఆలయ ప్రదక్షిణలు చేసి భక్తిశ్రద్ధలతో పిండి దీపాలను వెలిగించారు. తర్వాత వెంకటేశ్వరుని దర్శించుకోగా ఆలయ అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.