హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆలోచింపజేస్తున్న సైకత శిల్పం

తూ.గో: రేపు అంతర్జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగంపేటలో ప్రముఖ సైకిల్ దేవుని శ్రీనివాస్ కుమార్తెలు దేవిన సిస్టర్స్ (సోహిత, ధన్యత) రూపొందించిన సైకత శిల్పం ఆలోచింపజేస్తోంది. లింగ వివక్ష, వేధింపులు కాలసర్పాల్లా బాలికను చుట్టుముట్టిన తీరును సైకత శిల్పంలో చూపారు. 12 గంటల్లో, 12 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తుతో సైకతాన్ని తీర్చిదిద్దారు.