హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

TPT: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సినీ సంగీత దర్శకుడు, నటుడు ఆర్పీ పట్నాయక్, యాంకర్, సినీనటి ఉదయభాను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రీవారి సన్నిధిలో కీర్తనల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్పీ పట్నాయక్ బృందం పాల్గొనే ఈ కార్యక్రమానికి ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.