హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్

W.G: నరసాపురం పట్టణంలోని 26వ వార్డులో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ‘ఇంటింటికి మీ నాయకర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులో పర్యటిస్తూ స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓపికగా విన్న ఆయన, వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.