హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రీసర్వే పనులను పరిశీలించిన ఆర్డీవో

NTR: ఏ. కొండూరు మండలం, కోడూరు రెవెన్యూ గ్రామంలో జరుగుతున్న రీసర్వే గ్రౌండ్ ట్రూథింగ్ పనులను తిరువూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్ ఈరోజు పరిశీలించారు. రైతులు తమ భూముల వివరాలను సరిచూసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. భూముల కొలతలు పారదర్శకంగా, రైతుల సమక్షంలోనే జరగాలని తెలిపారు.