హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైకు అదుపుతప్పి భార్య భర్తలకు గాయాలు..!

ELR: వాడపల్లి నుంచి తిరుగు ప్రయాణంలో బాదంపూడి హైవేలో సుబ్రహ్మణ్యం ఆశ్రమం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి దంపతులు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఉంగుటూరు 108 అంబులెన్స్ EMT నాగ ప్రదీప్, పైలట్ సతీష్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.