హైదరాబాద్: 28°C
తెలంగాణ

108లో గర్భిణికి ప్రసవం... తల్లీ బిడ్డ క్షేమం

KMR: లొంగన్ గ్రామానికి చెందిన సంగీతకు ఈ రోజు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రం కావడంతో 108 సిబ్బంది ప్రసవం చేశారు. ఆమె ఆడబిడ్డకు జన్మనివ్వగా, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఈఎంటీ సంజయ్ తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జుక్కల్ పీహెచ్‌సీకి తరలించారు.