ఆర్క్‌టిక్ ఓపెన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. సింధుపై ప్రపంచ మాజీ ఛాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయిలాండ్) 21-11, 19-21, 21-18 స్కోరుతో విజయం సాధించింది. 62 నిమిషాల పాటు ఈ పోరు జరిగింది. ఈ ఓటమితో రచనోక్ చేతిలో సింధు పరాజయాల సంఖ్య 11కు చేరింది. ఆమెపై సింధు 4 సార్లు మాత్రమే గెలిచింది.
క్రీడలు
క్వార్టర్స్‌లో సింధు పరాజయం


