హైదరాబాద్: 28°C
వార్తలు

ఇన్‌స్టా రీల్.. నీటి కుంటలో పడి యువకుడు మృతి

TG: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లోని మల్కారం క్వారీలో విషాదం చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూసి ఫోటోలు దిగేందుకు వెళ్లిన గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల్లో పవన్ సాయి(18) అనే యువకుడు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఈత రాకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశాయి.