హైదరాబాద్: 28°C
వార్తలు

13 కోట్ల ఓటర్ల తొలగింపు అవాస్తవం: వెంకయ్య

AP: దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారనడం అవాస్తవమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థను వీధుల్లోకి లాగడం తగదన్నారు. ఐక్యంగా ఉన్నామని ఈసీ సభ్యులు చెబుతున్నారని, ప్రతిపక్షాలు ఎందుకు రాద్దాంతం చేస్తున్నాయో అర్థం కావట్లేదన్నారు. అంతిమంగా దేశప్రతిష్ట దెబ్బతినకుండా వ్యవహరించాలని, AI ద్వారా ఓట్లను తొలగిస్తున్నారనేది అపోహ మాత్రమే అన్నారు.