ప్రముఖ బాక్సర్ మేరీకోమ్‌పై మాజీ భర్త కరోంగ్ ఓంఖోలర్ ఢిల్లీ కోర్టులో పరువునష్టం దావా వేశాడు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలపై అతడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపించాడు. తాను ఆమెను మోసం చేశానని, వదిలేశానని ఆ ఇంటర్వ్యూలో ఆరోపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై నవంబర్ 19న విచారణ జరగనుంది.
క్రీడలు
మేరీకోమ్‌పై మాజీ భర్త పరువునష్టం దావా


