హైదరాబాద్: 28°C
వ్యాపారం

మీ సిబిల్ స్కోర్ ఉచితంగా చూసుకోండి

లోన్ కోసం బ్యాంకుకు వెళ్లే ముందు మీ సిబిల్ స్కోర్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. 750 పైన ఉంటే లోన్ సులువుగా, తక్కువ వడ్డీకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సిబిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఏడాదికి ఒకసారి ఉచిత రిపోర్ట్ పొందవచ్చు. పాన్ నంబర్, మొబైల్ నంబర్ ఉంటే చాలు. ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో కడితే స్కోర్ పెరుగుతుంది. స్కోర్ కోసం ఏ లింకుకూ డబ్బులు కట్టొద్దు.