హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌తో టీ20 సిరీస్.. చాప్‌మన్, ఫౌక్స్ దూరం

ఈనెల 22 నుంచి టీమిండియాతో న్యూజిలాండ్ అయిదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ నుంచి కివీస్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్, ఫాస్ట్‌బౌలర్ జాక్ ఫౌక్స్ గాయాల కారణంగా వైదొలిగారు. గత నెలలో చాప్‌మన్ ఎడమ కాలి కండరానికి గాయమైంది. అలాగే, ఫౌక్స్ ఇటీవల ప్రాక్టీస్ చేస్తుండగా అతడి కుడి తుంటికి గాయమైంది. వీరి స్థానంలో జోష్ క్లార్క్‌సన్, బ్లెయిర్ టిక్నర్ జట్టులో చేరారు.