హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారుల నిర్లక్ష్యం.. విద్యుత్ ఉద్యోగి బలి

NLG: కేతేపల్లి మండలం భీమారంలో విద్యుత్ షాక్‌తో బిల్ రీడర్ శ్రీనివాస్ మృతి చెందారు. 11 కేవీ వైర్‌పై పనులు చేస్తుండగా, ఎల్‌సీ ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆయన కన్నుమూశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.