హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో యూనియన్ JAC రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సతీశ్

KMR: తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల JAC ఉపాధ్యక్షుడిగా కామారెడ్డి జిల్లా దేవునిపల్లికి చెందిన తిప్పర్తి సతీశ్ విశ్వకర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 6న ఎల్లారెడ్డిలో జరిగిన సమావేశంలో ఆయనకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం, ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఎన్నికల హామీల అమలు కోసం పోరాడుతానని సతీశ్ అన్నారు.