హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫాంల బహూకరణ

SRPT: నేరేడుచర్ల మండలంలోని పెంచికల్‌దిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పూర్వ విద్యార్థి నాయిని సైదులు రూ.80 వేల విలువైన స్పోర్ట్స్ యూనిఫాంలను అందజేశారు. అమెరికాలో స్థిరపడిన ఆయన తాను చదువుకున్న పాఠశాలపై అభిమానంతో ఈ సహాయం చేశారు. ఆయన తల్లిదండ్రులు నాయిని సోమయ్య, సైదమ్మ చేతుల మీదుగా శుక్రవారం సాయంత్రం విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు.