హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ ఫామ్‌పై డివిలియర్స్ ప్రశంసలు

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుత ఆటతీరుపై దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ప్రస్తుతం ఎంతో ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఆడుతున్నాడని, అతడి ఈ ప్రస్తుత ఫామ్ ఎంతో ప్రమాదకరమని కొనియాడాడు. అతిగా ఆలోచించకుండా కేవలం ఇన్‌స్టింక్ట్ ఆధారంగా ఆడుతున్న కోహ్లీని నిలువరించడం ఎవరికీ సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు.