హైదరాబాద్: 28°C
వార్తలు

ఈరోజు నుంచి బతుకమ్మ వేడుకలు

TG: తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగ ఇవాళ్టి నుంచి తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. తీరొక్క పూలతో గౌరమ్మను కొలిచేందుకు ఆడపడుచులు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో అన్ని జిల్లాల్లోని నిమజ్జన ప్రాంతాల వద్ద పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, షీటీమ్స్ నిఘా వంటి విస్తృత ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది.