అన్నమయ్య: రైల్వే కోడూరు మండలం వి.వి కండ్రిగ లో రెవెన్యూ అధికారులు భూ కబ్జాలను తొలగించారు. మూడు నెలలుగా సర్వే నంబర్ 130 లో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగించారు. రైల్వే కోడూరు ఎమ్మార్వో ఇచ్చిన హామీ మేరకు 100 ఎకరాల భూమిలో నాటిన మామిడి, నిమ్మ చెట్లను డోజర్లతో తొలగించి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
భూ కబ్జాలపై రెవెన్యూ కొరడా


