హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెల్మెట్ లేకుంటే జరిమానా: ఎస్సై హారిక

KDP: సిద్ధవటం గ్రామ శివారులోని ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద శుక్రవారం రాత్రి SI హారిక విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా, సరైన వాహన పత్రాలు లేని ఏడుగురు ద్విచక్ర వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.185 చొప్పున జరిమానా విధించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగానికి దూరంగా ఉంటూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.