W.G: పోడూరు (M) చింతలగరువు పాఠశాలలో శుక్రవారం ముందస్తు దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం కొల్లాబత్తుల సూర్యకుమార్ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటారని తెలిపారు. నవరాత్రుల అనంతరం పదవ రోజున విజయదశమి వేడుకలు నిర్వహిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్
చింతలగరువులో ముందస్తు దసరా వేడుకలు


