హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజయవంతంగా ముగిసిన స్పీకర్ యూరప్ స్టడీ టూర్

RR: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ యూరప్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు నేతలు ఘనస్వాగతం పలికారు. జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాల్లో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్లమెంటరీ వ్యవస్థలు, చట్టాల రూపకల్పన, ఆధునిక సాంకేతికత వినియోగంపై అధ్యయనం చేశారు.