హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో అక్టోబర్ 12న శ్రీవారి ఆలయ భూమిపూజ..!

ఖమ్మం పట్టణంలోని అల్లీపురంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆలయ నిర్మాణ భూమిపూజ ముహూర్తం ఖరారైనట్లు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అక్టోబర్ 12న సోమవారం ఉదయం 9:30 గంటలకు ఈ వైభవ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది. సనాతన ధర్మ వైభవాన్ని చాటిచెప్పేలా నిర్మించబోయే ఈ పవిత్ర క్షేత్ర భూమిపూజలో భక్తులందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.