హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర స్థాయి పోటీలకు బూరగాం విద్యార్థులు

SKLM: పలాస మండలం బూరగాం ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జూడో పోటీలకు గేదెల శ్రావణి, పాండ్రేటి ప్రణవి, ఆట్యా-పాట్యా పోటీలకు గేదెల హారిక, నాగవరపు సాయికుమార్, తిప్పాన వేణుగోపాలరెడ్డి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు పూజారి హరిప్రసన్న, వ్యాయామ ఉపాధ్యాయిని అలివేణి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.