హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైల్వే లైన్ పనులు వేగవంతంగా జరిగేలా చూడాలి'

SDPT: సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు రైల్వే లైన్ పనులు వేగవంతంగా జరిగేలా పర్యవేక్షణ చెయ్యాలని జిల్లా కలెక్టర్ హైమావతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రైల్వే పనుల వల్ల రైతులకు, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చెయ్యాలని, బ్రిడ్జి నిర్మాణాలు వేగంగా పూర్తి చెయ్యాలని రైల్వే అధికారులను ఆదేశించారు.