దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌వీ నాయకుడు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థులను పాఠశాలలకు పిలిపించడం సరికాదన్నారు. అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
దసరా సెలవుల్లో క్లాసులా? చర్యలు తప్పవు!


