హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంకర తేలిన రహదారి.. వాహనదారుల అవస్థలు

NGKL: కల్వకుర్తి మండలంలోని తోటపల్లి నుంచి మాదారం ఎక్స్ రోడ్ వరకు 6 కిలోమీటర్ల రహదారి భారీగా గుంతలు ఏర్పడి కంకర తేలింది. ఈ దారిలో ప్రయాణించే ఆటోలు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.