హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

JN: జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆరోగ్యం, పోషకాహారం, మానసిక శ్రేయస్సుపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ప్రతి మంగళవారం ఆరోగ్య, శ్రేయస్సు దినం నిర్వహించాలని, రక్తహీనత, పోషకాహార లోపాలను గుర్తించి అవసరమైన విద్యార్థులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.