SRPT: కోదాడ ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్ ఎన్నికల్లో ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ యూనియన్‌ల అభ్యర్థులు విజయం సాధించారు. క్లాస్–3లో బస్సు గుర్తుకు 165 ఓట్లు రాగా, 71 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. క్లాస్–6లో నిచ్చెన గుర్తుకు 159 ఓట్లు వచ్చి, 62 ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తం 261 ఓట్లకు 259 ఓట్లు పోలయ్యాయి. విజేతలకు యూనియన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో బస్సు, నిచ్చెన గుర్తుల విజయం


