హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరిఖని టూ టౌన్‌ను తనిఖీ చేసిన సీపీ

PDPL: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా గోదావరిఖని టూ టౌన్ స్టేషన్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై నిత్యం నిఘా ఉంచాలని ఆదేశించారు. తనిఖీలో ఏసీపీ రమేష్, పాల్గొన్నారు.