E.G: గోకవరం బస్టాండ్ ఎదురుగా వాసుదేవర వీధిలో ఉన్న మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని మద్యం వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్. సూర్య నారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు. దుకాణం వద్ద అరుపులు, కేకలతో.. మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి, దుకాణాన్ని తొలగించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణం తొలగించాలని నిరసన


