హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫారం-III నమోదుపై ఎస్పీ కీలక సూచనలు

NDL: జిల్లాలో విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, హాస్టళ్లు, గెస్ట్‌హౌస్‌లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, గృహ యజమానులు వారి వివరాలను 24 గంటల్లోగా ఫారం-III ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఎస్పీ సునీల్ షొరాణ్ శుక్రవారం సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులతో పాటు జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.