హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడిగడ్డలో తప్పు జరిగితే బాధ్యులను శిక్షించాలి: బీజేపీ వికాస్

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల ఆస్తి అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నమనేని వికాస్ అన్నారు. మేడిగడ్డలో తప్పు జరిగితే బాధ్యులను గుర్తించి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. విచారణ పేరుతో కాళేశ్వరం పునరుద్ధరణలో కాలయాపన చేయడం సరికాదని ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటూనే రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.