హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వర్మీ కంపోస్టుతో ఆదాయం'

PPM: తడి, పొడి చెత్త సేకరించి వర్మీ కంపోస్టు తయారు చేస్తే పంచాయతీకి ఆదాయం లభిస్తుందని డివిజనల్ పంచాయతీ అధికారి నాగభూషణరావు తెలిపారు. వెంగాపురం గ్రామంలో ఘన వ్యర్థాల కేంద్రం వద్ద శుక్రవారం వర్మీ కంపోస్టు తయారీ విధానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటి వద్ద సేకరించిన చెత్తలోని  తడి చెత్త బిన్‌లో, పొడి చెత్తను బ్యాగ్‌లో వేసుకొని కేంద్రాలకు తరలించాలన్నారు.