హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొండికుంట పాఠశాలలో బతుకమ్మ సంబరా

BDK: అశ్వాపురం మొండికుంట గ్రామ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సర్పంచ్ మర్రి సంధ్య ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. మహిళలు, విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఇలాంటి వేడుకలతో భావితరాలకు మన సంస్కృతిని అందించవచ్చని తెలిపారు.