హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే విజయం'

W.G: రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీదే విజయమని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. నరసాపురంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఈ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయన్నారు. నరసాపురంలో సుమారు రూ. 15 కోట్లతో మోడ్రన్ డంపింగ్ యార్డ్ ను త్వరలోనే నిర్మిస్తున్నట్లు సుబ్బారాయుడు తెలిపారు.