ASR: హుకుంపేట మండలం డొంకినవలసలో చేగువేరా వర్ధంతిని శుక్రవారం వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పేదరిక నిర్మూలన, సమానత్వం కోసం చేగువేరా జీవితాంతం పోరాడారని తెలిపారు. క్యూబా విప్లవంలో కీలక పాత్ర పోషించిన ఆయన 1967అక్టోబర్ 9న బొలీవియాలో 39ఏళ్ల వయసులో మరణించారని గుర్తుచేశారు. అన్యాయం ఎక్కడ జరిగినా స్పందించే విప్లవ నాయకుడని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
డొంకినవలసలో చేగువేరా వర్ధంతి


