BHNG: బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని తిరుమలకుంట చెరువు సహజ అలుగు నీటి ప్రవాహాన్ని పైప్ లైన్ ద్వారా మళ్లించేందుకు ఆర్‌అండ్‌బీ శాఖ ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని గ్రామ సర్పంచ్ కొలను వాణి కృష్ణారెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుకు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
'పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి'


