హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

BHPL: మహదేవపూర్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, అధ్యాపకులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా సర్పంచ్ హసీనా భాను అక్బర్ ఖాన్, ఉప సర్పంచ్ శ్రీజా సంతోష్ హాజరయ్యారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు.