హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులు వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేయాలి: ఏవో

KRNL: ఖరీఫ్ సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో తుగ్గలి మండల రైతులు పెండింగ్‌లో ఉన్న ఈ-కేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేసుకోవాలని ఏవో సురేశాబాబు శుక్రవారం సూచించారు. రైతు సేవా కేంద్రాలను సంప్రదించి వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అవసరమైన ప్రక్రియలను సకాలంలో పూర్తి చేయాలని, నిర్లక్ష్యం చేయవద్దని కోరారు.