హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 3 కాంస్య పథకాలు

కోనసీమ: రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ బెంచ్ ప్రెస్ పోటీలలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. తిరువూరులో జరిగిన పోటీలలో ఇడుపులపాయలో త్రిబుల్ ఐటీ చదువుతున్న మామిడికుదురు మండలం పెదపట్నం వాసి జస్వంత్ ఎక్విప్ట్ బెంచ్ ప్రెస్ విభాగం, క్లాసిక్ బెంచ్ ప్రెస్ విభాగాల్లో రెండు కాంస్య పథకాలు, రాజోలుకి చెందిన ఎం.సన్నీ మరో కాంస్య పథకాన్ని సాధించారు.