హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనీస వేతన చట్టం అమలు చేయాలని ఆశా వర్కర్లు వినతి

KKD: కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ ఆశా వర్కర్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో సీఐటీయూ నేతలు లోవకుమారి, వరలక్ష్మి ఆధ్వర్యంలో తమ సమస్యలను వివరించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.