హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు: DEO

కోనసీమ: అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సాధారణ పాఠశాలలకు ఈ నెల 12 నుంచి దసరా సెలవులు ఇవ్వనున్నట్లు డీఈవో డాక్టర్ షేక్ మహబూబ్ బాషా తెలిపారు. క్రిస్టియన్ పాఠశాలలకు ఈ నెల 15 నుంచి సెలవులు ఉంటాయన్నారు. సెలవుల అనంతరం ఈ నెల 22న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సెలవుల్లో అనధికారికంగా తరగతులు నిర్వహిస్తే సంబంధిత పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.